మహారాష్ట్రలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి ముంబై ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో.. ముంబై వాసులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. శనివారం ఒక్కరోజే కొత్తగా 1,460 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ముంబైలో పాజిటివ్ కేసుల సంఖ్య 73,747కు చేరింది. మృతుల సంఖ్య 4,282కు చేరింది.
ఇక మహారాష్ర్ట వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,59,133 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారిన పడి ఇప్పటి వరకు 7,273 ప్రాణాలు కోల్పోయారు. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టినా పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.