బీహార్ లో ఎఐఎంఐఎం పోటీ.. 22 జిల్లాల పరిధిలో

Update: 2020-06-28 13:43 GMT

హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసి నేతృత్వంలోని ఎఐఎంఐఎం ఈ ఏడాది చివర్లో బీహార్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. అక్కడ జరిగే ఎన్నికల్లో 32 స్థానాలకు పోటీ చేస్తామని ఎంపి అసదుద్దీన్ వెల్లడించారు. ఇందుకోసం పోటీ చేయబోయే నియోజకవర్గాల మొదటి జాబితాను ఇటీవల విడుదల చేసింది.

బీహార్‌లోని 22 జిల్లాల్లో పరిధిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. ఇందులో తొలివిడత అభ్యర్థుల లిస్టును ప్రకటించింది. ప్రస్తుతం బీహార్ లో ఆ పార్టీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు, గత సంవత్సరం జరిగిన ఉప ఎన్నికలో కిషన్గంజ్ సీటును గెలుచుకుంది. ఆ పార్టీ తరుఫున కమ్రుల్ హుడా గెలుపొందారు.

Similar News