పాక్‌లో పెట్రోల్‌, డీజిల్‌ కొరత.. ధరలు భారీగా పెంచిన ఇమ్రాన్ సర్కార్

Update: 2020-06-28 11:36 GMT

పాకిస్తాన్‌లో గత కొన్ని రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ కొరత ఏర్పడటంతో.. అక్కడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పాక్ లో గత కొన్ని రోజులుగా పెట్రో ఉత్పత్తుల సరఫరా గణనీయంగా తగ్గిపోయింది. ఈ నేఫథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం శుక్రవారం అన్ని పెట్రోలియం ఉత్పత్తుల ధరలను అమాంతం పెంచేసింది.

పెట్రోల్ ధరలను లీటరుకు రూ.25.58 (పాక్ కరెన్సీలో) పెంచారు. దాంతో లీటరు పెట్రోల ధర రూ. 100.10 కు చేరింది. అదేవిధంగా డీజిల్ లీటరుకు రూ .21 పెరుగడంతో లీటరు డీజిల్‌ ధర రూ. 101.46 కు చేరింది. కొత్త ధరలు అమలులోకి వచ్చిన తరువాత దేశంలోని అనేక నగరాల్లో పెట్రోల్ పంపులు మూసివేశారు.

Similar News