బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గియా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో అవుతున్నాయి.. ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ కార్యకర్తలు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల భోపాల్ జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన కైలాష్.. ‘ఓ రోజు రాత్రి 2 గంటలకు మన కార్యకర్త నుంచి ఫోన్ వచ్చింది. పేకాట ఆడుతుంటే పోలీసులు అరెస్ట్ చేశారు విడిపించండి అని విజ్ఞప్తి చేశాడు. దీంతో వెంటనే సదరు పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి ఆ కార్యకర్తను విడిపించాను.
కార్యకర్తల వెన్నంటే బీజేపీ ఉంటుంది’ అంటూ వ్యాఖ్యానించారు. దాంతో ఆయనమీద ప్రత్యర్ధులు విరుచుకుపడుతున్నారు. ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు. పేకాట ఆడవాళ్లను పోలీసులు పట్టుకెళితే బీజేపీ ప్రధాన కార్యదర్శి ఫోన్ చేసి విడిపించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియోను కాంగ్రెస్ కమిటీ మీడియా సమన్వయకర్త నరేంద్ర సలుజా ట్విటర్‌లో పోస్ట్ చేస్తే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలపై ప్రశ్నలు సంధించారు. ‘ఇదేనా బీజేపీ విధానం? ఇలాంటి ఆలోచనల తోనే మీరు నవభారత్ నిర్మించేది? అంటూ ప్రశ్నించారు.