దేశంలో కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ఈశాన్య రాష్ట్రాల్లో లాక్ డౌన్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ఇక మణిపూర్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో .. రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మణిపూర్‌లో జులై 15 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బిరెన్ సింగ్ తెలిపారు. జులై 1 నుంచి జులై 15 వరకు మణిపూర్ రాష్ట్రంలో సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేయనున్నట్టు తెలిపారు. కాగా మణిపూర్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1092 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుండి 432 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
అటు అసోం రాష్ట్రంలో కూడా లాక్ డౌన్ జులై 15 వరకు పొడిగించారు. జూన్ 30 నుంచే అక్కడ తిరిగి పూర్తి స్థాయిలో లాక్ డౌన్ అమలు చేయనున్నారు. ఇప్పటికే చెన్నై మహానగరాన్ని లాక్ డౌన్ చేశారు.