ఉత్తర మయాన్మార్ లో కొండచరియలు విరిగిపడి 50 మంది మృతి చెందారు. జాడే గని వద్ద రాళ్లు సేకరిస్తున్నపుడు భారీగా వర్షం పడటంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. మృతుల్లో ఎక్కువగా మైనర్లు ఉన్నారని తెలుస్తుంది. అయితే, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. మట్టిదిబ్బలో చాలా మంది చిక్కుకుపోయారని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. హప్‌కాంత్ గనులలో ఇటీవలి కొండచరియలు విరిగిపడి వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు. వరుసగా ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తున్నాయి.