మయాన్మార్ దేశంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కచీన్ రాష్ట్రంలో ఇటీవల భారీగా వర్షాలు కురిసాయి. దీంతో పచ్చ రత్నాల గనిలో కి బురద, రాళ్లు వచ్చి చేరాయి. ఒక్కసారిగా భారీగా బురద, రాళ్లు రావడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు సజీవ సమాధి అయిపోయారు.
ఈ ప్రమాద ఘటనలో 50 మందిపైగా ప్రాణాలు కోల్పోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో వారందరూ పచ్చ రత్నాలను ఏరే పనిలో నిమగ్నమై ఉన్నారని అధికారులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన ఎమర్జెన్సీ సర్వీసు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.