కాపీ రైట్స్ ప్రాబ్లం.. ట్రంప్ పోస్ట్ చేసిన పిక్ తొలగించిన ట్విట్టర్

Update: 2020-07-02 23:35 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విటర్ లో పోస్ట్ చేసిన ఫోటోను.. ట్విట్టర్ తొలగించింది. ఆయన పోస్ట్ చేసిన ఫోటోకు కాపీరైట్స్ క్లెయిమ్ కావడంతో ట్విట్టర్ దానిని తొలగించిందని న్యూయార్క్ టైమ్స్ తెలపింది. గత నెల ట్రంప్ ఓ మీమ్ పోస్టు చేస్తూ.. వాస్తవానికి వారు నా తర్వాత కాదు.. వారు మీ తరువాత ఉన్నారు. నేను మీ దారిలోనే ఉన్నాను అని ట్వీట్ చేశారు. దాంట్లో ట్రంప్ ఫోటో బ్యాక్ గ్రౌండ్ లో ఉంది. అయితే ఈ ఫోటో గతసారి అమెరికా అద్యక్ష ఎన్నికల్లో ఉన్నపుడు ఓ న్యూయార్క్ టైమ్స్ ఫోటో గ్రాఫర్ తీసాడు. దీంతో ఆ ఫోటోను తొలగించింది.

Similar News