కరోనాతో ముప్పు వారికే ఎక్కువ: డబ్ల్యూహెచ్ఓ

Update: 2020-07-02 21:49 GMT

కరోనా బారినపడి మృతి చెందిన వారిలో ఎక్కువ మంది పొగతాగే వారే ఉన్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న కేసులు, నమోదవుతున్న మరణాలను పరశీలిస్తే ఈ విషయం తెలుస్తుందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. పొగతాగేవారు ఎక్కువ అనారోగ్యానికి గురికావడం.. మరణించడం జరుగుతోందని స్పష్టం చేసింది. ఇప్పటివరకూ 1.7 కోట్ల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అటు, మరణాల సంఖ్య 5.1 కి చేరింది. భారత్ లో కూడా కరోనా విజృంభిస్తుంది. ఇప్పటివరకూ సుమారు ఆరు లక్షలు పైగా కరోనా కేసులు భారత్ లో నమోదుకాగా.. సుమారు 18 వేలు మరణాలు సంభవించాయి.

Similar News