హైదరాబాద్ లో కరోనా.. ఆ ఏరియాల్లోనే ఎక్కువ కేసులు..

Update: 2020-07-04 13:42 GMT

నగరంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. దక్షిణ మండలంలో మరింత ఎక్కువగా కేసులు నమోదవడం అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు నమోదైన అధికారిక లెక్కల ప్రకారం పాజిటివ్ కేసులు 2,593 గా నిర్ధారణ అయింది. ఇక ప్రవేట్ ల్యాబ్ లలో పరీక్షలు చేయించుకున్న వారి వివరాలు తెలిస్తే మరింత రెట్టింపయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో కరోనాతో 117 మంది మృతి చెందగా, ఒక్క జల్ పల్లి మున్సిపాలిటీలో 116 మంది కరోనా బారిన పడ్డారు. అందులో ఇద్దరు మృత్యువాత పడ్డారు. మలక్ పేట సర్కిల్, సంతోష్ నగర్, చాంద్రాయణగుట్ట, చార్మినార్, ఫలక్ నుమా, రాజేంద్రనగర్ సర్కిల్ లో అత్యధికంగా కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి.

బహదూర్ పురా నియోజకవర్గం, ఫలక్ నుమా సర్కిల్ లోని కిషన్ బాగ్, అసద్ బాబా నగర్, యాకుత్ పురా నియోజకవర్గంలో చంచల్ గూడ, అమాన్ నగర్ ఎ, బి, రెయిన్ బజార్, తలాబ్ కట్ట, గౌలిపుర, చార్మినార్ నియోజకవర్గంలోని ఖాజీపురా, చౌక్, ఝాన్సీ బజార్, మొఘల్ పురా, మలక్ పేట నియోజకవర్గంలో అక్బర్ బాగ్, ఓల్డ్ మలక్ పేట, సైదాబాద్, మాదన్నపేట్, చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో ఫూల్ బాగ్, బాబా నగర్, రియాసత్ నగర్, గుల్షన్ ఎక్బాల్ కాలనీ, రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని అత్తాపూర్, హైదర్ గూడ, జలాల్ బాబా నగర్, హసన్ నగర్, శాస్తీపురం, మైలార్ దేవుపల్లి ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

Similar News