జపాన్ ‌లో వరదలు.. 13 మంది గల్లంతు

Update: 2020-07-04 16:50 GMT

కరోనాకు తోడు ప్రతీ దేశం ఏదో ఒక సమస్యతో సతమతమవుతోంది. మయన్మార్ లో కొండచరియలు విరిగిపడి 150 మందికి పైగా మరణించారు. తాజాగా జపాన్ వరదలతో అతలాకుతలం అవుతోంది. జపాన్ దక్షిణ ప్రాంతం నీట మునిగింది. కుమా నది పొంగటంతో హితోయోషి పట్టణంలో ఇళ్లు, వాహనాలు అన్ని జలమయం అయ్యాయి. ప్రజలు అంతా ఇళ్లు ఎక్కి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ వరదల్లో ఇద్దరు మృతి చెందగా.. 13 మంది గల్లంతు అయ్యారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాల నుంచి 75 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జపాన్ రాజధానికి వెయ్యి కిలోమీటర్లు దూరంలో ఉన్న కుమామోటో ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది

Similar News