2020 మొత్తం స్కూల్స్ బంద్.. సర్కార్ కీలక ప్రకటన

Update: 2020-07-07 23:00 GMT

ప్రపంచవ్యాప్తంగా కరోనా కరళా నృత్యం చేస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు నిత్యం అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. కరోనా మహమ్మారి విలయతాండవం చేసోన్న నేపథ్యంలో కెన్యా దేశం కీలక నిర్ణయం తీసుకుంది. 2020లో స్కూళ్లు తెరవకూడదని నిర్ణయించింది.

2021లో మళ్లీ స్కూల్స్ ఓపన్ చేస్తామని ప్రకటించింది. కెన్యా విద్యా శాఖ కేబినెట్ సెక్రటరీ ఈ మేరకు ప్రకటన చేశారు. కెన్యాలో కరోనా తీవ్రత నేపథ్యంలో స్కూల్స్ తెరవడం శ్రేయస్కరం కాదని ఆయన ప్రకటించారు. అయితే.. ఈ విద్యా సంవత్సరంలో ఏ క్లాస్ చదువుతున్నారో.. 2021లో మళ్లీ అదే క్లాస్‌లో చదవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

Similar News