అమెరికాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. ఒక్క రోజే 60 వేల మందికి పాజిటివ్
అమెరికాలో కరోనా కరళా నృత్యం చేస్తోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. అమెరికాలో పాజిటివ్ కేసుల సంఖ్య 30 లక్షలు దాటింది. ఈ విషయాన్ని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ పేర్కొంది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 1,31000 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే మంగళవారం మాత్రం పాజిటివ్ కేసుల సంఖ్య రికార్డు సృష్టించింది. ఆ ఒక్క రోజే దేశవ్యాప్తంగా 60 వేల కేసులు నమోదు అయ్యాయి. జూలై 2వ తేదీన నమోదైన 55,220 కేసుల రికార్డును మంగళవారం బ్రేక్ చేసింది.