రెండు సార్లు స్నోబోర్డు ప్రపంచ ఛాంపియన్, వింటర్ ఒలింపియన్ అలెక్స్ పులిన్ మృతి చెందాడు. ఆస్ట్రేలియాకు చెందిన అలెక్స్ పులిన్ బుధవారం నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. 32 ఏళ్ల అలెక్స్ పులిన్ గోల్డ్‌కోస్ట్ సముద్ర తీరంలో చేపల వేటకు వెళ్లాడు. అయితే ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు.
సముద్రంలోకి దూకే క్రమంలో అదుపుతప్పి పడిపోయి అలలపై తేలుతున్నప్పుడు గమనించినట్లు పోలీసులు తెలిపారు. సర్ఫర్లు లైఫ్‌గార్డ్‌ల సహాయంతో అతన్ని ఒడ్డుకు తీసుకువచ్చినట్లు పోలీస్ అధికారి తెలిపారు. కాగా, 2011,2013లో స్నోబోర్డ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో అలెక్స్ పులిన్ విజేతగా నిలిచాడు.