ప్రపంచం మొత్తం కరోనా అనే ఒకే ఒక్క శత్రవుతో ఏక కాలంలో పోరాటం చేస్తుంది. ఒకవైపు కరోనా గొలుసు బ్రేక్ చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తూనే.. మరోవైపు మహమ్మారికి మందును కనిపెట్టే పనిలో ఉన్నారు. ప్రపంచం మొత్తం కరోనాకు మందు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంది. అయితే, ముందు కనిపెట్టినా.. ప్రపంచం మొత్తం సరిపడేలా అన్ని డోసులు తయారు చేయడం సాధ్యంకాని పని. దీంతో వ్యాక్సిన్ కనిపెట్టినా.. ఎవరికి ముందుగా అందిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ కరోనా వ్యాక్సిన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్ కనిపెట్టిన తరువాత.. ఎక్కువ డబ్బులు బిడ్ చేసేవారికి కాకుండా అవసరం ఉన్నవారికి అందించాలని చూచించారు. ఈ సమయంలో డబ్బుల గురించి ఆలోచించకూడదని.. డ్రగ్స్, వ్యాక్సిన్ సరఫరా ఎక్కవ అవసరమున్న ప్రాంతాలకు ప్రాథాన్యం ఇవ్వాలని అన్నారు. ఇప్పటికే పలు దేశాలు కరోనా వ్యాక్సిన్ తయారి కోసం వేల కోట్ల డాలర్లు ఇన్వస్ట్ చేశారు. అమెరికా యూరప్ లాంటి దేశాలు ట్రయల్స్ కూడా చేస్తున్నారు. దీంతో ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. రెండు దశాబ్ధాల క్రితం ఎయిడ్స్ పై పోరాటంలో భాగంగా ప్రపంచదేశాలు కలిసికట్టుగా పని చేశాయని గుర్తు చేశారు. అదే స్పూర్తి కరోనా విషయంలో కూడా చూపించాలని అన్నారు.