జార్ఖండ్ సీఎంకు కరోనా పరీక్షల్లో నెగెటివ్ అని తేలింది. ఇటీవల మంత్రి మిథిలేష్ ఠాగూర్ తోపాటు మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే, ఇటీవల ముఖ్యమంత్రితో.. మిథిలేష్ ఠాకూర్ ప్రభుత్వం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో సీఎం స్వీయ నిర్భందంలోకి వెళ్లారు. దీంతో శనివారం సీఎం హేమంత్, ఆయన భార్యతో పాటు.. సీఎంఓలో పని చేసే సిబ్బందికి కరోనా పరీక్షలు జరిపారు. ఈ పరీక్షల్లో అందరికీ.. నెగెటివ్ రావటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.