కజకిస్థాన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు

Update: 2020-07-11 21:47 GMT

కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలై.. సుమారు ఏడు నెలలు అవుతున్నా.. ఇంకా చాలా మంది సొంత ప్రాంతాలకు చేరుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉన్నత విద్య కోసం కజకిస్తాన్ వెళ్లిన తెలుగు విద్యార్థులు.. స్వస్థలాలకు చేరుకోవడానికి విఫల ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో యూనివర్సిటీలు తాత్కాలికంగా మూతపడటంతో తిరిగి సొంత ప్రాంతాలకు వెళ్లాలనుకుంటున్నా.. రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే, కజకిస్తాన్ లోని ఓ ట్రావెల్ ఏజెన్సీ రవాణా సదుపాయం కల్పిస్తానమని చెప్పి.. 45 వేలు కట్టించుకొని.. తరువాత తమను మోసం చేశారని.. మెడికల్ విద్యార్థులు వాపోతున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

Similar News