ఈ ఔషధాలు కరోనాను కట్టడి చేయలేవు.. ఎక్కువగా వాడితే.. : ఐసీఎంఆర్

Update: 2020-07-12 12:55 GMT

కరోనా నుంచి కాస్త ఉపశమనం కోసం ఈ ఔషధాలు తీసుకోవాలే తప్ప.. అదీ డాక్టరు సూచించిన ప్రకారం వాడాలే కానీ అనవసరంగా వాడితే మేలు కంటే కీడే ఎక్కువగా జరిగే అవకాశం ఉందని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) ఎయిమ్స్ లు రాష్ట్రాలకు సూచించాయి. కొవిడ్ కోసం నిర్థేశించిన రెమిడెసివిర్, టోసిలిజుమాట్ వంటి ఔషధాలను నిబంధనల మేరకే వాడాలని సూచిస్తున్నారు. కరోనాకు ఇంతవరకు ఎలాంటి చికిత్స లేనందున ఈ ఔషధాలను తగు మోతాదులో వాడాలని సూచిస్తున్నట్లు పేర్కొన్నాయి. పరిమితికి మించి వీటిని వాడితే కాలేయం, మూత్రపిండాలకు హాని కలిగే ప్రమాదం ఉందని హెచ్చరించాయి. లక్షణాలు తీవ్ర స్థాయిలో ఉన్నవారికి ఈ ఔషధాలు వాడితే త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుందని వివరించాయి. అయితే మరణాల శాతాన్ని తగ్గిస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఆరోగ్య శాఖ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది.

Similar News