హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిగ్రీ చదువుతున్న విద్యార్థునులకు ఓ అవకాశం కల్పించింది. గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ తో పాటే.. పాస్ పోర్టును కూడా అందిస్తామని.. సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి. పాస్‌పోర్ట్‌కు సంబంధించిన ప్రక్రియ మొత్తాన్ని కళాశాలలోనే పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. హెల్మెట్ ఫర్ ఎవ్రీ హెడ్ అనే కార్యక్రమానికి హాజరైన ఖట్టర్ ఈ విషయాన్ని తెలిపారు.