15 మంది మత్స్యకారులను ఇండియన్ కోస్ట్ గార్డు (ఐసీజీ) సిబ్బంది రక్షించారు. బంగాళఖాతంలో చిక్కుకుపోయిన వీరిని రక్షించినట్లు కమాండ్ ఆఫ్ డీఐజీ విజయ్ సింగ్ తెలిపారు. వీరంతా పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారుగా వెల్లడించారు.
గస్తీ నిర్వహణలో భాగంగా ఉత్తర బంగాళాఖాతంలో మోహరించిన ఐసీజీ నౌక విజయకు ‘కృష్ణ కన్య’ అనే మత్స్యకారుల పడవ నుంచి రక్షించాల్సిందిగా అత్యవసర ఫోన్ వచ్చిందని తెలిపారు. వెంటనే స్పందించి పడవలో చిక్కుకుపోయిన 15 మందిని రక్షించామని కమాండ్ ఆఫ్ డీఐజీ తెలిపారు.