ఉత్తరప్రదేశ్‌లో కరోనా కరళా నృత్యం చేస్తోంది. రోజు రోజుకీ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారాంతరాల్లో లాక్‌డౌన్ విధించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే శనివారం నుంచి లాక్‌డౌన్ అమల్లోకి రానుంది. ఈ లాక్‌డౌన్ జులై చివరి వరకు కొనసాగనుందని అధికారులు ప్రకటించారు. ప్రత్యేకంగా జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయనున్నామని అధికారులు వెల్లడించారు. ప్రతి శని, ఆదివారాల్లో మార్కెట్లు మూసి ఉంటాయని తెలిపారు.
కాగా, ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటివరకు 35,092 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి ఇప్పటి వరకు 913 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మహమ్మారి బారి నుండి 22,689 మంది బాధితులు కోలుకున్నారు. మరో 11,490 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.