కరోనా ఎఫెక్ట్: జూలై 19న మూతపడనున్న కోల్‌కతా హైకోర్టు

Update: 2020-07-13 19:55 GMT

కరోనా మహమ్మారి పశ్చిమబెంగాల్ లో స్వైరవిహారం చేస్తుంది. కోల్‌కత లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. నగరంలో చాలా ప్రాంతం కంటోన్మెంట్ జోన్ లో ఉంది. దీంతో కొత్త దశ లాక్‌డౌన్ దృష్యా ఈ నెల 19 వరకూ కోల్‌కత హైకోర్టు మూసివేస్తున్నట్టు చీఫ్ జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్ తెలిపారు. కలకత్తాలో లాక్‌డౌన్ విధించడంతో జూలై 10 నుంచి 13 వరకూ మూతపడ్డాయి. కోర్టు భవనాల శానిటైజేషన్ చేశారు. అయితే, తాజాగా జూలై 19 వరకూ హైకోర్టు మూసివేత కొనసాగుతోందనిజ చీఫ్ జస్టిస్ ప్రకటించారు. లాక్‌డౌన్ కారణంగా మూతబడిన హైకోర్టు రెండున్నర నెలల విరామం తర్వాత జూన్ 11న భౌతిక విచారణల కోసం తిరిగి తెరుచుకుంది.

Similar News