సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు విడుదల

Update: 2020-07-15 15:44 GMT

సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు విడుదలైయ్యాయి. కొన్ని సబ్జెక్టులకు మాత్రమే పరీక్షలు జరిపి.. కరోనా కారణంగా మిగిలిన సబ్జెక్టులు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే, కరోనా ప్రభావం రోజురోజుకూ పెరగడంతో.. ఆ పరీక్షలు రద్దు చేశారు. అయితే, క్లాసులో విద్యార్థుల ప్రతిభ, ఇంటరనల్ మార్కుల ఆధారంగా ఈ సబ్జెక్టులకు గ్రేడులు కేటాయించారు. సోమవారం ఇంటర్ ఫలితాలు ప్రకటించగా.. 10వ తరగతి ఫలితాలు బుధవారం విడుదల చేశారు. మొత్తం ఈ సంవత్సరం 18 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. ఫలితాలను www.cbseresults.nic, www.cbse.nic.in వెబ్‌సైట్లలో చూసుకోవాలని కేంద్రం తెలిపింది. ఉమాండ్‌ మొబైల్‌ యాప్‌, 011-24300699 టోల్ ‌ఫ్రీ నంబర్‌ ద్వారా ఫలితాలు‌ తెలుసుకోవచ్చని పేర్కొంది.

Similar News