తెలంగాణలో పలుచోట్ల రెండురోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వానాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక పరిసర ప్రాంతాల్లో 3.6 కిలోమీటర్ల నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అలాగే వాయవ్య బంగాళాఖాతంలో 2.2 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తువరకు మరొకటి ఏర్పడింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం, గురువారం ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వానలు కురుస్తాయని తెలిపింది. ఇక ఉపరిత ఆవర్తనం ప్రభావంతో రాగల మూడు రోజులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.