మా దేశం వస్తారా.. ఒక్క డాలరుకే ఇల్లు కొనుక్కోవచ్చు..

Update: 2020-07-16 17:31 GMT

ఉన్న ఊళ్లో పనులు లేవు, వ్యవసాయం అంతంత మాత్రమే.. దీంతో బ్రతుకుదెరువు కోసం పట్నం బాట పడుతున్నకుటుంబాలెన్నో. ఈ పరిస్థితి ఇండియాలోనే కాదు ఇటలీలో కూడా కొనసాగుతోంది. పట్టణాల్లో స్థిరపడుతున్న వారు సొంత ఇళ్లను వదిలేయడంతో గ్రామాలన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. దీంతో ఇళ్లన్నీ పాడుపడినట్లు అయిపోతున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం ఓ ఆలోచన చేసింది. నివాసం ఉండాలనుకునే వారిని ఆహ్వానించి పాడుబడిన ఇళ్లకు పూర్వ వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో 'ఆపరేషన్ బ్యూటీ' మిషన్ చేపట్టింది.

నిర్మానుష్యంగా మారిన గ్రామాల్లో ఒకటైన చింక్వా ఫ్రాండీలో ఖాళీగా ఉన్న ఇళ్లను స్వాధీనం చేసుకుని కేవలం ఒక్క అమెరికన్ డాలరుకే అమ్మకానికి పెట్టింది. కానీ దాంతో పాటు కొన్ని షరతులు కూడా విధించింది. ఇళ్లు బాగా పాడుపడిపోయాయి కాబట్టి వాటిని తీసుకుని మూడేళ్లలో బాగు చేసుకోవాలి లేదా పుననిర్మించుకోవాలి. అప్పటి వరకు ఏడాదికి 280 డాలర్లు (సుమారు రూ.21 వేలు) ఇన్సూరెన్స్ పాలసీ కట్లాల్సి ఉంటుంది. ఇల్లు బాగు చేసుకున్నాక ఇన్సూరెన్స్ కట్టాల్సిన పన్లేదు. అయితే మూడేళ్లు దాటినా ఇల్లు బాగుచేయించుకోపోతే ప్రభుత్వం 22,470 డాలర్లు (సుమారు రూ17 లక్షలు) జరిమానా విధిస్తుంది.

Similar News