ఆగస్టులో రామాలయ శంకుస్థాపన

Update: 2020-07-17 14:09 GMT

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సర్వం సిద్ధం చేస్తుంది. ఆలయ శంకుస్థాపన తేదీని ఆదివారం ఖరారు చేయనున్నారు. శంకుస్థాపన పనులకు ప్రధాని మోదీని ఆహ్వానించాలని ట్రస్టు సభ్యులు నిర్ణయించారు. మోదీకి ఆమోదంగా ఉన్న రోజున శంకుస్థాపనకు సిద్దం చేస్తామని అన్నారు. తేదీ ఖరారు చేసిన తరువాత ప్రధానికి ఆహ్వానం పంపిస్తామని.. మోదీతోపాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ను కూడా ఆహ్వానిస్తామని ట్రస్టు చైర్మన్ నృపేంద్ర మిశ్రా అన్నారు. ఆగస్టులో ఏదో ఒక రోజు శంకుస్థాపనకు సిద్దం అవుతున్నట్టు ట్రస్టు సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులతోపాటు.. చాలా మంది ప్రముఖులు పాల్గొంటారని ట్రస్టు తెలిపింది.

Similar News