ఎస్‌బీఐ కార్డ్స్‌ ఎండీ, సీఈఓ హర్డ్యాల్ ప్రసాద్‌ రాజీనామా

Update: 2020-07-17 11:36 GMT

ఎస్‌‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ ఎండీ, సీఈఓ హర్డ్యాల్ ప్రసాద్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఎస్‌బీఐ కార్డ్స్‌ తెలియజేసింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి వాలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకున్నందుకు డైరెక్టర్‌ పదవికి ప్రసాద్‌ రాజీనామా చేశారు. ఆయన ఈనెల 31 వరకు పదవిలో కొనసాగనున్నారు. కొత్త ఎండీ, సీఈఓగా అశ్విని కుమార్‌ తివారిని ఎస్‌బీఐ నియమించింది. ఆయన ఆగస్ట్‌ 1న పదవిని చేపట్టి రెండేళ్ళ పాటు కొనసాగనున్నారు.

Similar News