జూన్ 30తో ముగిసిన తొలి త్రైమాసికంలో డేటా, కేబుల్ సర్వీస్ ప్రొవైడర్ హాత్‌వే కేబుల్ మొత్తం ఆదాయంలో 6.7 శాతం క్షీణత నమోదైంది. అయితే లాభాలు మాత్రం మెరుగ్గా ఉన్నాయి. గత ఏడాది ఇదే సమయంలో రూ.9.7 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసిన ఈ కంపెనీ.. క్యూ-1లో రూ.65.9 కోట్లకు తమ లాభాన్ని పెంచుకుంది.
ఇక కంపెనీ ఆపరేషనల్ పెర్ఫామెన్స్ స్ట్రాంగా ఉంది. ఎబిటా 26.9శాతం పెరిగింది. ఎబిటా మార్జిన్స్ 20.7 శాతం నుంచి 28.2 శాతానికి ఎగబాకాయి. ఇక బ్రాడ్‌బాండ్ సెగ్మెంట్ నుంచ ఆదాయం 9శాతం పెరిగింది. అయితే కేబుల్ టీవీ వ్యాపారం మాత్రం 14శాతం క్షీణించింది.