మార్కెట్లో మరోమోసం.. బీకేర్ ఫుల్

Update: 2020-07-24 11:28 GMT

షేర్ మార్కెట్లో మోసాలు కొత్తకాదు.. IPOల ద్వారా నిధులు సమీకరించి నిబంధనలకు విరుద్దంగా మళ్లిస్తున్నాయి కొన్నిసంస్థలు. ఇలాంటి కేసులు ఇటీవల ఎక్కువయ్యాయి. తాజాగా మరో కంపెనీ కూడా ఇలాంటి మోసాలకే పాల్పడిందన్న ఆరోపణలు వచ్చాయి. ఫైవ్ కోర్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీ IPO ద్వారా నిధులు సమీకరించింది. ఇందులో రూ.46.66 కోట్లు దారి మళ్లించినట్టు గుర్తించింది సెబీ. తప్పుడు విధానాల్లో నిధులు వినియోగించినట్టు సెబీకి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ప్రాధమికంగా తప్పు జరిగినట్టు గుర్తించిన సెబీ మార్కెట్ నుంచి కంపెనీని తప్పించింది. మళ్లీ ఆర్డర్స్ వచ్చేవరకు ఎలాంటి లావాదేవీలు నిర్వహించరాదని ఆదేశించింది. ఆస్తులు అమ్మకం.. బదలాయింపులు, మళ్లింపు చేయరాదని స్పష్టం చేసింది. కంపెనీలో జరిగిన ఆర్ధిక అవకతవకలపై విచారణ జరపడానికి ఇండిపెండెంట్ ఆడిటర్ ను నియమించాలని NSEని ఆదేశించింది సెబీ. 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కోరింది. ప్రమోటర్స్ అమరజిత్ కల్రా, సురీందర్ కౌర్, జగ్జీత్ కౌర్ సహా పలువురు ఉన్నారు. సో.. మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. స్మాల్, మిడ్, లార్జ్ సంబంధం లేకుండా..కంపెనీ ప్రోఫైల్, హిస్టరీ చూసుకోవాలి. లేదంటే స్టాక్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడి ఆవిరి అవుతుంది.

Similar News