తప్పు చేశాను.. క్షమించండి: బోరిస్ జాన్సన్

Update: 2020-07-25 15:15 GMT

మహమ్మారి వైరస్ గురించి ముందే తెలిసినా దేశ ప్రజలను రక్షించలేకపోయాను. ఫలితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆవేదన వ్యక్తం చేశారు. తొలినాళ్లలో వైరస్ కట్టడికి సమర్ధవంతమైన చర్యలు అవలంభించలేకపోయామని అన్నారు. కొవిడ్ మరణాల సంఖ్య అధికంగా ఉన్న దేశాల్లో బ్రిటన్ ఒకటి. బోరిస్ బ్రిటన్ ప్రధాని పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.

మహమ్మారి మళ్లీ విజృంభించే అవకాశాలు ఉన్నందున చేసిన తప్పులు మళ్లీ పునారావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. మహమ్మారితో మరణించిన ప్రతి ఒక్కరికి బోరిస్ సంతాంపం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు జరిగిన చర్యలన్నింటికీ తాను బాధ్యత వహిస్తున్నట్లు చెప్పారు. కాగా బ్రిటన్ లో ఇప్పటి వరకు 2,97,914 మంది వైరస్ బారిన పడగా, వీరిలో 45,677 మంది మరణించారు. ప్రధాని బోరిస్ కు పాజిటివ్ రాగా పది రోజులు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుని కోలుకున్నారు. ఓ దశలో బోరిస్ వెంటిలేటర్ పై ఉండి చికిత్స పొందాల్సి వచ్చింది.

Similar News