విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, కరోనాను గుర్తించడానికి జర్వం ఒక్కటే లక్షణంగా భావించడం చాలా తప్పని శాస్త్రవేత్తలు అంటున్నారు. జ్వరాన్నే కరోనాకు ప్రమాణికంగా పరిగణిస్తే.. చాలా కేసులు నమోదు కాకుండా ఉండే ప్రమాదం ఉందని ఎయిమ్స్ ఆధ్వర్యంలో జరిగిన ఓ అధ్యయనం హెచ్చరించింది. ఇలా గుర్తింపుకు దూరంగా ఉండిపోయిన కరోనా రోగులు సమాజంలో వ్యాధి వ్యాప్తి కారణమైయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇటీవల ఎయిమ్స్ శాస్త్రవేత్తల ఆద్వర్యంలో జరిగిన అధ్యయనంలో 144 మంది పేషెంట్లను పరిశీలించగా.. 17 శాతం మందికే జ్వరం లక్షణాలు కనిపించాయని తెలిపారు.