అన్నసమారాధనకు హాజరైన 25మందికి కరోనా

Update: 2020-07-26 15:41 GMT

రాజస్థాన్‌లో అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న 25మందికి కరోనా సోకింది. రాజస్థాన్‌లో కరోనా రోజురోజుకి విజృంభిస్తుంది. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా ఈ మహమ్మారి వ్యాప్తి ఏమాత్రం తగ్గటంలేదు. దీంతో ప్రభుత్వం రాజ‌స్థాన్ ప్రివెన్ష‌న్ ఆఫ్ మృత్యు భోజ్ చ‌ట్టం-1960ను అమ‌లులోకి తీసుకువ‌చ్చింది. ఈ చట్టం ప్రకారం ఎవరైనా మృతి చెందిన తరువాత అన్నసమారాధన కార్యక్రమాలు నిర్వహించడానికి అవకాశం లేదు. చట్టాన్ని అతిక్రమించి ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినా.. కార్యక్రమాలకు హజరైనా.. ఏడాదిపాటు జైలు శిక్ష విధించ‌నున్నారు.

అయితే,చురు జిల్లాలోని సుజ‌న్‌గ‌ఢ్‌లో నిబంధనలు ఉల్లంఘించి అన్న‌స‌మారాధన కార్య‌క్ర‌మానికి 25మంది హాజరైయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న అధికారులు వారికి క‌రోనా టెస్టులు నిర్వ‌హించ‌గా, వారంతా పాజిటివ్ అని తేలారు. దీంతో వారిని కోవి‌డ్ ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

Similar News