కొవిడ్ తగ్గలేదు.. పెరిగింది.. మరింత జాగ్రత్త అవసరం: మోదీ

Update: 2020-07-26 15:28 GMT

కరోనా వ్యాప్తికి కట్టడి చర్యలు చేపట్టినా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మొదట్లో కంటే అది ఇప్పుడు మరింత ప్రమాదకరంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఇది మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయమని ఆయన అన్నారు. ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించిన మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే మిగతా దేశాల కంటే భారత్ లో కొవిడ్ పాజిటివ్ కేసులు కానీ, మరణాలు కానీ తక్కువగానే ఉన్నాయని అన్నారు. కానీ వైరస్ ముప్పు ఇంకా ముగియలేదని అన్నారు. మాస్క్ లేకుండా బయటకు రావద్దన్నారు. బయటకు వచ్చే ముందు కొవిడ్ యోధులను ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి అని అన్నారు. కరోనా నుంచి దేశం విముక్తి పొందాలని, ఆత్మ నిర్భర భారత్ కోసం ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజలు కోరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

Similar News