ఢిల్లీలో కరోనాపై పోరాటం చేసి ఈ మహమ్మారిని ప్రభావాన్ని ప్రభుత్వం గణనీయంగా తగ్గించింది. ఢిల్లీ ప్రభుత్వం కరోనాపై తీసుకుంటున్న చర్యలు దేశానికే ఆదర్శంగా ఉంటున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా నియంత్రణపై చర్చించేందుకు ఈ నెల 27న కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలతో సమావేశం కానుంది. ఈ సమావేశంలో కరోనా కట్టడికి ఢిల్లీ మోడల్‌ను అవలంబించాలని సూచించనున్నదని ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అధ్యక్షత వహించనున్నారు. తాజాగా ఢిల్లీలో కరోనా కట్టడిపై తీసుకుంటున్న చర్యలను గురించి
మాట్లాడుతూ..కాగా ఢిల్లీలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యల గురించి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాట్లాడుతూ పటిష్టమైన క్వారంటైన్ విధానం, కరోనా గణాంకాలపై పారదర్శక డేటా, ఆసుపత్రులలో పడకలు, ప్లాస్మా థెరపీ మొదలైన విధానాలను అనుసరిస్తున్నామన్నారు.