కరోనా రోగుల కోసం ఏర్పాటు చేసిన బెడ్ల రోజురోజకు ఖాళీ అవుతున్నాయని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. గతంతో పోల్చితే కొత్తగా నమోదవుతున్న కేసులు తక్కువగా ఉండటంతో పాటు.. రికవరీ రేటు గణనీయంగా ఉండటమే దీనికి కారణమని అన్నారు. చాలా మంది కరోనా చికిత్సను ఇంటి నుంచే పొందేందుకు ఇష్టపడుతున్నారని అన్నారు. ఢిల్లీలో కరోనా కేసులు లక్ష 30వేలకు చేరువలో ఉన్నాయని.. ఇప్పటివరకూ 3806మంది కరోనాతో మరణించారని సీఎం తెలిపారు. అయితే, రికవరీ రేటు ఎక్కువగా ఉండటంతో యాక్టీవ్ కేసులు చాలా తక్కువగా ఉన్నాయని అన్నారు. కరోనా యాక్టివ్ కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఎనిమిదవ స్థానంలో ఉన్నాయని అన్నారు.