బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కు శనివారం కరోనా పరీక్షలు నిర్వహించారు. పశువుల దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు లాలూ ప్రసాద్ యాదవ్. బీహార్‌లో కరోనా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో జైలు నుంచి లాలూ ప్రసాద్ యాదవ్‌ను విడుదల చేయాలని రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) ఏప్రిల్ నెలలో డిమాండ్ చేసింది.
కాగా, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తుండటంతో.. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే లాలూకు కరోనా పరీక్షలు చేసినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం జార్ఖండ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న లాలూ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో ఆయన గత కొద్ది రోజుల నుంచి రాజేంద్ర ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.