బీజేపీ ప్రజాస్వామ్యాన్ని హత్య చేసింది: రాహుల్

Update: 2020-07-26 17:31 GMT

రాజస్థాన్‌‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. వీటిపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ ట్వీట్ చేశారు. మనమందరం ఐక్యంగా ఉండి.. ప్రజాస్వామ్యం కోసం గొంతెత్తుదాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని అని ట్వీట్ చేశారు. ఓ ఆడియోను కూడా దానికి జత చేశారు. ఈ ఆడియోలో ‘‘బీజేపీ రాజ్యాంగాన్ని చీల్చివేసింది. ప్రజాస్వామ్యాన్ని కూల్చివేసింది. రాజస్థాన్‌లో ప్రజాస్వామ్యాన్ని హత్య చేసింది’’ అంటూ కాంగ్రెస్ ఆరోపించింది.

Similar News