మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ విద్యార్థులు తీపి కబురు చెప్పారు. ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించినవారికి ఉచితంగా ల్యాప్‌టాప్‌లను అందించాలని నిర్ణయించినట్లు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. మధ్యప్రదేశ్ సీఎంకు ఇటీవల కరోనా సోకిన విషయం తెలిసిందే. దీంతో చికిత్స పొందుతున్న ఆయన.. అధికారులతో మాట్లాడుతూ మెరిట్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల కొనుగోలుకు వీలుగా రూ. 25వేల అందించాలని ఆదేశించారు. 2019-20 విద్యాసంవత్సరంలో మెరిట్ మార్కులు సాధించిన విద్యార్థులకు ల్యాప్ టాప్ లు అందిస్తామని సీఎం చెప్పారు.