బంగారం ధర పరుగులు తీస్తోంది. వారం రోజులుగా భారీగా పెరుగుతోంది. రూ.55,000 మార్క్‌కు చేరువవుతోంది గోల్డ్ రేట్. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా సరికొత్త ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకుంటుంది బంగారం. ఇక అంతర్జాతీయ మార్కెట్లో 2వేల డాలర్ల దిశగా పుత్తడి పరుగులు పెడుతోంది. దీంతో సెప్టెంబరు 2011లో నమోదైన మార్కును దాటేసింది. హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాముల ప్యూర్ గోల్డ్ రూ.54,300కి చేరింది. ఇక వెండి ధర సోమవారం ఒక్కరోజే రూ.3500 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.66,400కి చేరింది. భవిష్యత్‌లో వీటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ ట్రేడింగ్ వర్గాలు అంటున్నాయి. ఇదే విధంగా ధరలు పెరుగుకుంటాపోతే సామాన్యుడికి బంగారం అందని దాక్షగా మిగలనుంది.