పైలట్ వర్గంలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు తనతో సంప్రదింపులు జరుపుతున్నారని, 48 గంటల్లో జైపూర్ చేరుకుంటామని కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్ ఇంచార్జ్ రణదీప్ సుర్జేవాలా పేర్కొన్నారు. మిగతా ఎమ్మెల్యేలు కూడా తిరిగి రావాలనుకుంటే వారు సోనియా, రాహుల్ గాంధీలతో మాట్లాడి క్షమాపణలు చెప్పాలన్నారు. అలా వస్తే వారి సభ్యత్వానికి ఎటువంటి ముప్పు ఉండదని అన్నారు.. సుర్జేవాలా వాదనను పైలట్ క్యాంప్ ఎమ్మెల్యే హేమరం తప్పుబట్టారు. పైలట్ వర్గం నుండి ఒక్క ఎమ్మెల్యే కూడా బయటికి రారని, అయితే గెహ్లాట్ క్యాంప్‌కు చెందిన 13 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని, కొద్దిరోజుల్లో తమ వద్దకు వస్తారని చెప్పారు.