మమత బెనర్జీ నేతృత్వంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కరోనా కట్టడికి కఠిన చర్యలు అమలు చేస్తున్నారు. ఈ మహమ్మారిని అడ్డుకునేందుకు బెంగాల్ రాష్ట్రవ్యాప్తంగా వారంలో రెండు రోజులు సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఆగస్టులో వారంలో రెండు రోజుల లాక్‌డౌన్ అమలవుతుందనని సీఎం మమతా బెనర్జీ తెలిపారు. దీంతో ఆగస్టులో మొత్తం 9 రోజుల పాటు పూర్తి లాక్‌డౌన్ అమలులో ఉంటుందని చెప్పారు. అయితే, ఆగస్టు1న బక్రీద్ కనుక..ఆ రోజు ఎలాంటి లాక్‌డౌన్ ఉండబోదని తెలిపారు. ఇక, ఆగస్టు 2, 5, 8, 9, 16, 17, 23, 24, 31 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ విధిస్తామని ఆమె చెప్పారు