సింగపూర్‌ పార్లమెంట్‌ తొలి ప్రతిపక్ష నేతగా భారత సంతతి వ్యక్తి

Update: 2020-07-29 08:37 GMT

భారత సంతతికి చెందిన ప్రతీమ్‌ సింగ్‌ సింగపూర్‌ తొలి ప్రతిపక్ష నేతగా నియామకమయ్యారు. ప్రీతమ్‌ ప్రతిపక్ష నాయకుడిగా తన పాత్రలో అదనపు అధికారాలను పొందుతారని.. మరిన్ని బాధ్యతలు స్వీకరిస్తారని అధికారులు ఆ పదవి వివరాలను మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి నియామకం ఇదే ప్రథమం.

43 ఏళ్ల ప్రతీమ్‌ వర్కర్స్‌ పార్టీ సెక్రెటరీ జనరల్‌గా కొనసాగుతున్నారు. జూలై 10న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన 93 పార్లమెంట్‌ స్థానాల్లో వర్కర్స్‌ పార్టీ పది స్థానాలను గెలుచుకుంది. దీంతో సింగపూర్‌ పార్లమెంట్‌లో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా నిలిచింది.

Similar News