మీడియాలో అతిపెద్ద విలీనం

Update: 2020-07-29 15:23 GMT

సోనీ పిక్చర్స్ నెట్ వర్క్, వయాకామ్ 18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్ విలీన ప్రక్రియ మొదలైంది. ఆగస్టులో దీనిపై స్పష్టమైన ప్రకటన విడుదల చేయనున్నాయి కంపెనీలు. 2021 నుంచి ఒకే గొడుగు కింద నుంచి ప్రసారాలు రానున్నాయి. వయాకామ్ 18లో ప్రస్తుతం 51శాతం రిలయన్స్, 49శాతం అమెరికాకు చెందిన వయాకామ్ సంస్థకు వాటాలున్నాయి. ఇప్పుడు వయాకామ్ 18లో సోనీ కంపెనీ 74శాతం వాటా తీసుకుంటోంది. ఈ రెండు సంస్థలకు 26శాతం మాత్రమే వాటా మిగుతుంది. ఈ డీల్ ద్వారా ఇరు సంస్థలకు ప్రయోజనం ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. డిజిటల్ ఫ్లాట్ ఫాంలో రిలయన్స్ కు టీవీ ప్రసార హక్కుల విషయంలో భారీగా లబ్ధి కులుగుతోంది. ఆధిపత్యం వస్తుందని కంపెనీ వర్గాలు అంటున్నాయి. అటు ఇండియా టెలివిజన్ మార్కెట్లో న్యూస్, ప్రాంతీయ భాషా చానల్స్, చిల్డ్రన్ విభాగంగా సోనీ వీక్ గా ఉంది. తాజా విలీనంతో సోనీకి ఇండియా మార్కెట్లో గ్రిప్ దొరుకుతుంది. మెర్జర్ ద్వారా ఇండియా టెలివిజన్ రంగంలో 18-20శాతం మార్కెట్ వాటా కంపెనీ సొంతమవుతుంది. వ్యూవర్ షిప్ లో కూడా 45శాతం వస్తుందని అంచనా.

Similar News