ప్రపంచదేశాలు భారత్‌ను నిలువరించాలి: పాక్

Update: 2020-07-30 19:57 GMT

రాఫెల్ యుద్ద విమానాలను భారత్ కు వచ్చిన తరువాత పాక్ మనసులో మర్మాన్ని బయటపెట్టింది. భారత్.. భద్రత అవసరాలకు మించి మిలటరీ సామర్థ్యాన్ని పెంచుకుంటుందని పాక్ విదేశాంగ శాఖ తెలిపింది. అవసరానికి మంచి ఆయుధ సంపత్తి ఈ విధంగా పెంచుకోవడం వలన దక్షిణాసియాలో ఆయుధ పోటీ పెరిగే ప్రమాదం ఉందని పేర్కొంది. ఇలా నచ్చినట్టు ఆయుధాలను పెంచుకుంటున్న భారత్ ను ప్రపంచ దేశాలు నిలువరించాలని పాక్ కోరింది. కాగా.. బుధవారం ఐదు రాఫెల్ విమానాలు భారత్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. రాఫెల్ జెట్‌ల రాక భారత సైనిక చరిత్రలో కొత్త శకానికి ఆరంభమని రక్షణశాఖ ప్రకటించింది.

Similar News