ఉత్తరాఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీష్ ధామి గురువారం రాష్ట్రంలోని పిథోరగర్ ధార్చుల ప్రాంతంలో అదుపుతప్పి వరదనీటిలో పడిపోయారు. అయితే సకాలంలో పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు అప్రమత్తమై రక్షించారు. దాంతో ఎమ్మెల్యే హరీష్ ధామి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఒక వీడియోలో, నీట మునిగిన ప్రాంతాలలో ఎమ్మెల్యే హరీష్ ధామి తోపాటు
డజను మందికి పైగా వ్యక్తులు నడుచుకుంటూ వెళుతుండటం కనిపిస్తుంది. ఇక వరదల పరిస్థితిపై మాట్లాడిన ఎమ్మెల్యే.. కొండప్రాంతాల నుంచి కొట్టుకువస్తున్న చెత్తాచెదారం, వరద నీటితో అవస్థలు పడుతున్నారని చెప్పారు. నీట మునిగిన ప్రాంతాల ప్రజలను సురక్షితం ప్రాంతాలకు చేర్చేందుకు విమానాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.