దశాబ్దాలపాటు కరోనా.. కంట్రోల్ కాని మహమ్మారి: డబ్ల్యుహెచ్‌వో

Update: 2020-08-01 15:43 GMT

కరోనా వచ్చి ఆర్నెల్లయింది.. అయినా ఇప్పుడే వెళ్లదంట. దశాబ్దాల పాటు మనతోనే సహజీవనం చేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌వో) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ అంచనా వేశారు. సంస్థ అత్యవసర విభాగం మరోసారి సమావేశమై ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై కొన్ని సిఫారసులు చేసింది. ఇలాంటి మహమ్మారులు శతాబ్దానికి ఒకసారి వెలుగుచూస్తాయని.. వాటి ప్రభావం దశాబ్దాల పాటు కొనసాగుతుందని తెలిపారు. అయితే కరోనా విషయంలో శాస్త్రసంబంధమైన అనేక సమస్యలకు పరిష్కారం లభించిందని.. ఇంకా అనేక వాటికి సమాధానం దొరకాల్సి ఉందని అన్నారు. ఇంకా చాలా మంది వైరస్ బారిన పడే ప్రమాదం ఉందని అన్నారు. తగ్గుముఖం పట్టింది మళ్లీ రాదు అనుకోవడానికి లేదు. ఆ ప్రాంతాల్లో మళ్లీ విజృంభించే అవకాశాలు లేకపోలేదు అని పేర్కొన్నారు. ఇప్పటి వరకు వైరస్ ప్రభావానికి గురికాని దేశాలు సైతం మహమ్మారి బారిన పడే ప్రమాదం ఉందని తెలిపారు.

Similar News