మూడు రాజధానుల బిల్లు : ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

Update: 2020-08-04 18:33 GMT

ఏపీలో మూడు రాజధానుల బిల్లుపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మూడు రాజధానులు, crda రద్దు బిల్లులను వ్యతిరేకిస్తూ రైతులు దాఖలు చేసిన పిటిషన్లను ఈ రోజు ఏపీ హైకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది. దీనిపై ఈ నెల 14 వరకూ రాజధానుల బిల్లుపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ ఈ నెల 14 కు వాయిదా వేసింది హైకోర్టు.

కౌంటర్ దాఖలు పది రోజుల సమయం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోర్టును కోరింది. దీంతో కౌంటర్ దాఖలు చేయడానికి పదిరోజుల సమయం ఇచ్చింది హైకోర్టు. కాగా బిల్లులు రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. పిటిషన్ల తరపున శ్యామ్ దివాన్, ఉన్నవ మురళీధర్ వాదనలు వినిపించారు.

Similar News