అయోధ్యలో రామాలయ భూమిపూజ జరిగిన సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆసక్తికర ట్వీట్ చేశారు. శ్రీరాముడు ఉత్తమ మానవీల విలువలు కలిగిన వాడని అన్నారు. మన మనసు లోతుల్లో ఉన్న మానవత్వానికి శ్రీరాముడి మనవీయ విలువలే కారణమని అన్నారు. రాముడికి ప్రేమించడం తప్ప, ద్వేషించడం తెలియదని ట్వీట్ చేశారు. ఆయన కరుణామయుడు.. ఎప్పడూ న్యాయం వైపే ఉన్నవాడని తెలిపారు. శ్రీరాముడు అన్యాయాన్ని సహించడంటూ ట్విట్టర్ వేదికగా తెలిపారు. కాగా.. అయోధ్యలో రామాలయ భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే.