రైల్వేశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎంతో కాలంగా రైల్వే శాఖలో పాతుకుపోయిన వలసవాద ధోరణికి చెక్ పెట్టింది రైల్వే బోర్డు. ‘ఆర్డర్లీ వ్యవస్థ’ ను రైల్వే బోర్డు రద్దు చేసేసింది. ఇకపై ఈ పోస్టుల్లో భవిష్యత్ లో నియామకాలు చేయకూడదని నిర్ణయించింది. దీంతో ఆర్డర్లీ వ్యవస్థ స్వస్తి పలికింది. ఆర్డర్లీ వ్యవస్థను రద్దు చేసిన బోర్డు మరో వ్యవస్థను రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ‘టెలిఫోన్ అటెండెంట్’ వ్యవస్థను కూడా రద్దు చేసేందు కు చర్చలు జరుపుతుంది. ఇకపై ఈ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు, నియామకాలు ఇంకా ఉండవని బోర్డ్ స్పష్టం చేసింది.