పశ్చిమ బెంగాల్ సిపిఐ (ఎం) నాయకుడు శ్యామల్ చక్రవర్తి కన్నుమూశారు. ఆయన గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ తో బాధపడుతూ కోల్‌కతా లోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం మధ్యాహ్నం వ్యాధి తీవ్రత ఎక్కువవడంతో శ్వాస అందక కన్నుమూశారు.
శ్యామల్ చక్రవర్తి పశ్చిమ బెంగాల్‌లో సీనియర్ ట్రేడ్ యూనియన్ నాయకుడిగా ఉన్నారు. ఆయన మృతికి సిపిఐ (ఎం) సంతాపం ప్రకటించింది. "కామ్రేడ్ శ్యామల్ చక్రవర్తి మరణం పట్ల మేము తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాము. ఆయన అనుభవజ్ఞుడైన నాయకుడు, మాజీ మంత్రి & సిపిఐ (ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు. ఈ రోజు దేశంలో కార్మికవర్గం మరియు వామపక్ష ఉద్యమం ఓడిపోయింది ఒక ముఖ్యమైన స్వరం మూగబోయింది అని సిపిఐ (ఎం) నాయకులు ఆయన మృతికి నివాళులు అర్పించారు. జెండాలను అతని జ్ఞాపకార్థం ఉంచుతామని అన్నారు.